Breaking News

కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పట్ల తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నేలకొందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ తిరిగి సీఎం అవుతారని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు ధీమా వ్యక్తం చేశారు. కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, ‘రికాల్, రిగ్రెట్, రివోల్ట్’ (తిరస్కరణ, పశ్చాత్తాపం, తిరుగుబాటు) అనే అంశాలపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతోందన్నారు. అలాగే, భాజపాతో బిఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారాన్ని…

Read Full News

కేసీఆర్ కడితే.. రేవంత్ రిబ్బన్లు కట్ చేస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి కేవలం ఒక ‘రిబ్బన్ కటింగ్ సీఎం’ అని ఎద్దేవా చేసిన ఆయన, గతంలో కేసీఆర్ నిర్మించిన కట్టడాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రారంభిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి, కరీంనగర్ కలెక్టరేట్ కేసీఆర్ ఆనవాళ్లు కాదా అని సూటిగా ప్రశ్నించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అభివృద్ధిలో కనీసం…

Read Full News

స్త్రీనిధి రుణ చెల్లింపుల్లో గందరగోళం.. రూ.1 లక్ష ఎక్కడికి?

రుణం చెల్లింపు పేరుతో రూ.1 లక్ష తీసుకున్నారంటూ మహిళ ఆరోపణ PhonePe లావాదేవీలు, రుణ కార్డు, చెల్లింపు రికార్డులతో విచారణకు డిమాండ్ రూ.3,615 అదనపు చెల్లింపుపైనా అనుమానాలు.. రూ.50 వేల వ్యక్తిగత రుణం తీసుకున్నారంటూ ఫిర్యాదు సిరికొండ పోలీస్‌స్టేషన్‌లో FIR నమోదు.. సమగ్ర దర్యాప్తు కోరుతున్న బాధితురాలు సిరికొండ, సెప్టెంబర్ 30:(E6tv NEWS: శివ ఠాకూర్).మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక చేయూత అందించేందుకు అమలు చేస్తున్న స్త్రీనిధి రుణాల చెల్లింపుల వ్యవహారంలో గందరగోళం నెలకొన్నట్లు…

Read Full News

తుమ్మిడిహట్టి బ్యారేజీకి త్వరగా అనుమతులు ఇవ్వాలి

కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి.. ఢిల్లీ: తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం కోరిన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించినట్లు కేంద్ర మంత్రికి వివరించారు. మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఢిల్లీలో సీఆర్ పాటిల్‌తో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై…

Read Full News

సాగునీటి విడుదలలో ఆలస్యంపై ఈటల ఆగ్రహం

తెలంగాణలో రైతులకు సాగునీరు అందించడంపై దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. బుధవారం రామగుండం ఎన్టీపీసీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల కరువు పరిస్థితులు నెలకొంటున్నందున, సాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఈటల విమర్శించారు. అలాగే తెలంగాణకు కీలకమైన సింగరేణి సంస్థను అమ్ముకునే…

Read Full News

రాజ్యాంగాన్ని తెలుసుకుందాం – హక్కులను కాపాడుకుందాం

బోధన్, సెప్టెంబర్ 30:(E6 tv NEWS: ప్రతినిధి). చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్, బోధన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమాన్ని బోధన్ మండలం అమ్డాపూర్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అడ్లూరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు డా. వారే దస్తగిరి ముఖ్య వక్తగా హాజరై విద్యార్థులకు భారత రాజ్యాంగం, రాజ్యాంగ విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డా. దస్తగిరి…

Read Full News

రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్ దాడి: కేంద్ర మంత్రి బండి సంజయ్

ఎన్నికల బరిలో ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపిని ఓడించడం సాధ్యం కాదనే నైరాశ్యంతోనే సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య స్తంభాలపై బురదజల్లుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం, సీఈసీ, ఈవీఎంలపై కాంగ్రెస్ పదేపదే నిందలు వేయడం సబబు…

Read Full News

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో రైతులకు మరింత ప్రయోజనం

లక్కంపల్లి సెజ్‌లో అనువైన స్థలాల పరిశీలన.. రైస్ బ్రాన్ ఆయిల్, సోయా పరిశ్రమల ఏర్పాటుకు కృషి… నిజామాబాద్, సెప్టెంబర్ 30:(E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే స్థానిక రైతాంగానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం నందిపేట మండలం లక్కంపల్లి సెజ్ పరిసర ప్రాంతాల్లో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన స్థలాలను ఆయన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్….

Read Full News

జీవో 150 ఎఫెక్ట్:తెలంగాణ విద్యార్థులకు అన్యాయం

వైద్య ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నం.150 తెలంగాణ విద్యార్థులకే నష్టదాయకంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా నాలుగేళ్ల చదువు ఆధారంగా స్థానికత కేటాయించే ఈ నిబంధన వల్ల, ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలంగాణలోనే చదివిన జల్ల అంకిత అనే విద్యార్థిని ఇంటర్ ఏపీలో పూర్తి చేయడంతో ‘నాన్-లోకల్’గా మిగిలిపోయింది. ఈ విషయమై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో 150 ప్రకారం వరుస నాలుగేళ్ల చదువు…

Read Full News

గచ్చిబౌలిలో పోలీసులపై RMP డాక్టర్ దాడి: కేసు నమోదు

హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నానక్‌రామ్‌గూడ అపోలో ఆసుపత్రి సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఒక RMP డాక్టర్ దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. 112 ఎమర్జెన్సీ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ శివకుమార్‌తో నిందితుడు వాగ్వాదానికి దిగి, భౌతిక దాడికి దిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఫిర్యాదు ఆధారంగా విచారణ జరుపుతున్న సమయంలో హెడ్ కానిస్టేబుల్ శివకుమార్‌తో సదరు వ్యక్తి మాటామాటా పెంచుకున్నాడు….

Read Full News