రాయకూర్–సిద్ధాపూర్ రహదారిపై మొరం పోయించిన కోనేరు శశాంక్
రుద్రూర్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి).
రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామం నుంచి సిద్ధాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి బురదమయంగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. సమస్యను బీజేపీ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ, బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకుడు, ఎన్నారై కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లారు.
సమస్యను తెలుసుకున్న కోనేరు శశాంక్ స్పందించి, తన సొంత ఖర్చులతో అస్తవ్యస్తంగా మారిన రహదారిపై మొరం వేయించారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు కొంతమేర ఇబ్బందులు తగ్గాయని గ్రామస్తులు తెలిపారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే స్పందించి సొంత ఖర్చుతో రహదారి మరమ్మతులకు చర్యలు తీసుకున్న కోనేరు శశాంక్‌కు రాయకూర్, సిద్ధాపూర్ గ్రామాల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రహదారికి శాశ్వత పరిష్కారం చూపేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

