యాపిల్స్కే కాదు.. బ్లూబెర్రీస్కూ కేరాఫ్ అడ్రస్ కానున్న కాశ్మీర్!
శ్రీనగర్ : తరతరాలుగా యాపిల్ పంటకు ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయలో ఇప్పుడు ఒక కొత్త హార్టికల్చర్ విప్లవానికి నాంది పడుతోంది. షేర్-ఎ-కాశ్మీర్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (SKUAST) నిర్వహించిన పరిశోధనల్లో బ్లూబెర్రీస్ (Blueberries) సాగు విజయవంతమైంది. అక్కడ పండిన బ్లూబెర్రీస్ రుచి, పరిమాణం ఊహించిన దానికంటే అద్భుతంగా ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యాపిల్స్ పండని నేలల్లో బ్లూబెర్రీస్! యాపిల్ తోటలకు భిన్నంగా బ్లూబెర్రీ సాగు సాగుతుందని ప్రొఫెసర్ అషఫాక్ పండిట్ తెలిపారు:…

