Breaking News

రేవంత్ పాలనలోనే పాతబస్తీకి అభివృద్ధి: వలీవుల్లా సమీర్

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీని అభివృద్ధి పథంలోకి తీసుకవస్తూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్, మాజీ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ వలీవుల్లా సమీర్ అన్నారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన మౌలిక వసతులు, వైద్యం, గృహ నిర్మాణం, రవాణా రంగాలకు సీఎం ప్రాధాన్యమిస్తున్నారని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా సమీర్ మాట్లాడుతూ.. గతంలో పాతబస్తీని కేవలం తాత్కాలిక ఉపశమన చర్యలకే పరిమితం చేశారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాతబస్తీని హైదరాబాద్ భవిష్యత్తు ప్రగతిలో భాగస్వామ్య ప్రాంతంగా గుర్తించి సమగ్ర అభివృద్ధి చేపడుతోందని చెప్పారు.

ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులు:

  • చంచల్‌గూడ-సంతోష్‌నగర్ ఫ్లైఓవర్: ప్రాంతీయ రవాణా కష్టాలను తీర్చేందుకు వంతెన పనుల వేగవంతం.
  • మెట్రో విస్తరణ: పాతబస్తీ మెట్రో రైలు మార్గం పనుల త్వరితగతిన పూర్తికి చర్యలు.
  • ఉస్మానియా ఆసుపత్రి: 2,000 పడకలతో నూతన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి భవన నిర్మాణం.
  • మీరాలం చెరువు: మీరాలం చెరువు అభివృద్ధి మరియు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం.
  • ఇతర సంక్షేమ పథకాలు: అర్బన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మరియు మూసీ పునరుజ్జీవనం ద్వారా పాతబస్తీ రూపురేఖలు మార్చే బృహత్తర ప్రణాళికలు.

దశాబ్దాలుగా హైదరాబాద్ ప్రధాన అభివృద్ధికి దూరంగా ఉన్న పాతబస్తీకి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమాన ప్రాధాన్యం దక్కుతోందని, ఇది నగర సమగ్ర వికాసానికి దోహదపడుతుందని సమీర్ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *