Breaking News

నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

రుద్రూర్, అక్టోబర్ 21 (E6tv న్యూస్).

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో కీ.శే. ఇందూరు జగన్ మోహన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం 10 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. జగన్ మోహన్ కుమారులు ఇందూరు శ్రీధర్, శ్రీకాంత్‌ల సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇందూరు శ్రీధర్ మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు తమ వంతు సహాయం అందించాలని అన్నారు. పేదలకు అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు.ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గగన్ యాదవ్, గౌతమ్, తాహెర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *