Breaking News

మీనూరులో దసరా బంగారం సందడి

జమ్మి ఆకులను బంగారంగా భావించి పంచుకున్న గ్రామస్తులు

మీనూరు, అక్టోబర్ 21 (E6tv న్యూస్).

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మీనూరు గ్రామంలో విజయదశమి పండుగ సందర్భంగా దసరా బంగారం సందడి నెలకొంది. గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా జమ్మి ఆకులను బంగారంగా భావించి ఒకరికొకరు పంచుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆప్యాయతను చాటుకున్నారు.

చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ గ్రామంలో ఆనందోత్సాహాల మధ్య సాగింది. జమ్మి ఆకులను బంగారంగా పంచుకునే సంప్రదాయం ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, ప్రేమానురాగాలను పెంపొందిస్తోంది.మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఆచారాన్ని గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో కొనసాగించారు. దసరా పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు నింపాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *