ముంబాజీపేట్‌లో అమ్మవారికి ప్రత్యేక పూజలు.. గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు
ఎల్లారెడ్డి, అక్టోబర్ 21 (E6tv న్యూస్).
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని ముంబాజీపేట్ గ్రామంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రుల ఉత్సవాల్లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు. శ్రీ జగన్మాత సేవా సమితి సభ్యుల ఆహ్వానం మేరకు గ్రామంలోని అమ్మవారి మండపాన్ని సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జాజాల సురేందర్ మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామం సుభిక్షంగా ఉండటంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, దేవి యూత్ సభ్యులు, శ్రీ జగన్మాత సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
