తెలంగాణలో బీజేపీ మౌనంగా ఉందన్న ప్రచారాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తోసిపుచ్చారు. గురువారం నిజామాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా తెలంగాణలో కాషాయ సునామీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
సమావేశంలోని ముఖ్య విశేషాలు:
- కేటీఆర్ గడ్డంపై సెటైర్లు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గడ్డం పెంచడంపై అర్వింద్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. “గడ్డం పెంచుకుంటే సీఎం అవుతారని ఎవరో చెప్పడంతోనే కేటీఆర్ ఇలా చేస్తున్నారేమో! గతంలో కేసీఆర్‌కు పాత సచివాలయానికి వెళ్తే ఓడిపోతారని చెబితే కొత్త సచివాలయం కట్టారు.. అయినా ఓడిపోయారు. గతంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా ఇలాగే గడ్డం పెంచారు. కేటీఆర్‌కు గడ్డం పెరుగుతుందేమో కానీ సీఎం మాత్రం కాలేరు” అని ఎద్దేవా చేశారు.
- కాంగ్రెస్ – బీఆర్ఎస్ పొత్తు ఆరోపణలు: కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉందని అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ను పదవి నుంచి తప్పించేందుకే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నారని, ఇరు పార్టీల నేతలు పరస్పరం కాపాడుకుంటున్నారని ఆరోపించారు.బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శలు: కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతికి వేదికగా మార్చిన బీఆర్ఎస్కు ప్రజలు మళ్లీ ఓటేయ్యరని, సోషల్ మీడియా పెయిడ్ ప్రచారాలతో ఆ పార్టీ గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను వేరే ఎవరూ ఓడించాల్సిన అవసరం లేదని, ఆ పార్టీనే స్వయంగా కనుమరుగవుతుందని అన్నారు.
- బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శలు: కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతికి వేదికగా మార్చిన బీఆర్ఎస్కు ప్రజలు మళ్లీ ఓటేయ్యరని, సోషల్ మీడియా పెయిడ్ ప్రచారాలతో ఆ పార్టీ గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను వేరే ఎవరూ ఓడించాల్సిన అవసరం లేదని, ఆ పార్టీనే స్వయంగా కనుమరుగవుతుందని అన్నారు.
రానున్న రోజుల్లో మీడియా, సోషల్ మీడియా వేదికగా బీజేపీ సరికొత్త దూకుడుతో ముందుకు వెళ్తుందని, బీఆర్ఎస్ పార్టీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తుందని అర్వింద్ స్పష్టం చేశారు.
