Breaking News

నిజామాబాద్ రీజియన్ ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త

ఆన్‌లైన్‌లో బస్సు టికెట్ల బుకింగ్ సదుపాయం వినియోగించుకోవాలి

నిజామాబాద్, అక్టోబర్ 22 (E6 TV NEWS).

నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, అలాగే నగరాల నుంచి తిరిగి గ్రామీణ ప్రాంతాలకు ప్రయాణించే ప్రజలు టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రీజినల్ మేనేజర్  ఎస్.వి.జి. కృష్ణమూర్తి సూచించారు.

ప్రయాణికులు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్రణాళిక చేసుకునేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సందర్శించి అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ప్రయాణానికి ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని రీజినల్ మేనేజర్ కోరారు.ప్రజలకు అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలను సద్వినియోగం చేసుకొని తమ ప్రయాణాలను సౌకర్యవంతంగా పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *