మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
ఇందూరు, అక్టోబర్ 22 (E6tv NEWS).
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ‘అలయ్ బలయ్’ ప్రతీకగా నిలుస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. దసరా సమ్మేళనంలో భాగంగా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఒకచోట చేరి స్నేహపూర్వక వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం స్ఫూర్తిదాయకమని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఎన్నో ఏళ్లుగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయను అభినందించారు.
దత్తాత్రేయ ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని ఆయన కుమార్తె కొనసాగించడం సంతోషకరమని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తూ, వాటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడం గొప్ప పరిణామమని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు.

