Breaking News

మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ నాయకులు

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా కలిసిన మాద్రి పృథ్వీరాజ్.

పటాన్‌చెరు, అక్టోబర్ 22 (E6tv NEWS).

విజయదశమి, దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి బీఆర్‌ఎస్ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావుకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దసరా పండుగ సందర్భంగా పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం మన సంప్రదాయంలో గొప్ప ఆచారమని మాద్రి పృథ్వీరాజ్ పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.

పెద్దల ఆశీస్సులు, ఆప్యాయతలను పొందుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని, పండుగల స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పృథ్వీరాజ్ అన్నారు. దసరా పండుగను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *