ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో శనివారం మధ్యాహ్నం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలు దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహూతయ్యాయి. నోయిడా సెక్టార్ 125 పరిధిలోని రాయ్పూర్ ప్రాంతంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఐదు టీ, స్నాక్స్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
సెక్టార్ 126 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా సమీప రహదారులను మూసివేశారు. సహాయక చర్యల సమయంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఒక వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో ఎల్పీజీ సిలిండర్లు ఉండటంతో భారీ ప్రమాదం తప్పిందని, శిథిలాల కింద ఎవరైనా ఉన్నారనే కోణంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని నోయిడా చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ వెల్లడించారు.
