Breaking News

న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం

వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో సొంతం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో డారిల్ మిచెల్ (89 నాటౌట్), ఫిన్ అలెన్ (40) రాణించడంతో 198/3 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 199 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ పవర్‌ప్లేలో రికార్డు స్థాయిలో 118 పరుగులు సాధించడమే కాకుండా తొలి వికెట్‌కు కేవలం 7.1 ఓవర్లలోనే 133 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అభిషేక్ శర్మ కేవలం 35 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుని, మొత్తంగా 38 బంతుల్లో 113 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. వైభవ్ (19 బంతుల్లో 45) మెరుపులు మెరిపించడంతో భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి రికార్డు విజయాన్ని నమోదు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *