ఎన్నికల సంఘం (EC) పనితీరును, ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ప్రధాన జన్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించగా.. ఎన్నికల సంఘం సోమవారం రాత్రి సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌పై సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది గడువు కోరడంతో కోర్టు 10 రోజుల సమయం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో దీపావళి సెలవుల అనంతరం నవంబర్ 17న ఈ కేసు తదుపరి విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలను ఎన్నికల సంఘం తన అఫిడవిట్లో ఖండించింది. ఎస్ఐఆర్ (SIR) కింద జరిపిన మూడు ఉత్తర్వులు పూర్తిగా కమిషన్ ఏకాభిప్రాయంతో తీసుకున్నవేనని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టులో SIR వివాదం:పిటిషనర్లకు 10 రోజుల గడువు..
