Breaking News

సూడాన్ మార్కెట్‌పై డ్రోన్ దాడి: 100 మందికి పైగా మృతి

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సూడాన్‌లో డ్రోన్ దాడులు తీవ్ర కలకలం సృష్టించాయి. దక్షిణ డార్ఫర్‌లోని న్యాలా నగరం వద్ద రద్దీగా ఉండే మార్కెట్‌పై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, అందులో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఈ దాడి సూడాన్ సైన్యమే చేసిందని మానవ హక్కుల బృందాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు, రాజధాని ఖార్తూమ్ శివార్లలోని అల్-మర్ఖియత్ ట్రాన్స్‌ఫార్మర్ స్టేషన్‌పై పారామిలటరీ గ్రూప్ ‘ఆర్‌ఎస్‌ఎఫ్’ (RSF) డ్రోన్ దాడికి పాల్పడటంతో నగరంలో 60 శాతం విద్యుత్ సరఫరాతో పాటు నీటి సరఫరా కూడా పూర్తిగా స్తంభించి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2023 ఏప్రిల్ నుంచి సైన్యానికి, ఆర్‌ఎస్‌ఎఫ్‌కు మధ్య జరుగుతున్న ఈ పోరు వల్ల సూడాన్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంక్షోభం నెలకొందని ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *