ఫార్ములా ఈ-రేస్ నిధుల మళ్లింపు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావుకు తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయన పాస్‌పోర్ట్ జప్తునకు సంబంధించి జారీ అయిన నోటీసుల వ్యవహారంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసు విచారణలో భాగంగా ఏసీబీ (ACB) కోరిన అభ్యర్థన మేరకు, కేటీఆర్ పాస్‌పోర్ట్‌ను ఎందుకు జప్తు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (RPO) ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ చర్యలు ఏకపక్షమని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమని పేర్కొంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి. వేణుగోపాల్, పాస్‌పోర్ట్ నోటీసుల ప్రక్రియపై స్టేటస్ కో విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు
