Breaking News

తీరం దాటిన అర్నాబ్.. కోస్తాంధ్ర అతలాకుతలం!

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్ణబ్’ అతి తీవ్ర తుఫాను బుధవారం ఉదయం యానాం సమీపంలో తీరాన్ని దాటింది. ఆరు గంటలకు పైగా కొనసాగిన ఈ ప్రక్రియతో కోస్తాంధ్ర తీవ్రంగా దెబ్బతింది. తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్లు, గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులు, కుండపోత వర్షాల కారణంగా తీవ్ర అపార నష్టం వాటిల్లడంతో పాటు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. తీరం దాటిన అనంతరం ఇది ‘తీవ్ర తుఫాను’గా బలహీనపడినప్పటికీ, దీని ప్రభావంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.

విశాఖపట్నంలో అత్యధికంగా 315 మి.మీ, విజయనగరంలో 301 మి.మీ, అనకాపల్లిలో 275 మి.మీ, శ్రీకాకుళంలో 257 మి.మీ చొప్పున భారీ వర్షపాతం నమోదైంది. ముందుజాగ్రత్త చర్యగా ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో తీరప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఈదురుగాలులకు అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. విమాన, రైలు సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీరం దాటినప్పటికీ రాగల రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *