Breaking News

మెట్‌పల్లిలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ

ఎమ్మెల్యే సంజయ్ నివాసం ముట్టడికి కాంగ్రెస్ నాయకుల యత్నం.. అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు

మెట్‌పల్లి, నవంబర్ 17: (E6tv NEWS).

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మున్సిపల్ కార్మికులను తన వ్యక్తిగత పనులకు వినియోగించుకుంటున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ ఆరోపణలకు నిరసనగా ఎమ్మెల్యే సంజయ్ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఎమ్మెల్యే నివాసం ముట్టడికి ప్రయత్నించారు. అయితే ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడిస్తే సహించేది లేదంటూ బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.సమాచారం అందుకున్న మెట్‌పల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎమ్మెల్యే నివాసం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.దీంతో మెట్‌పల్లి పట్టణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *