Breaking News

సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.24.70 లక్షల ఆర్థిక సాయం

రామచంద్రపురం, భారతీనగర్‌కు చెందిన 7 కుటుంబాలకు రూ.3.31 లక్షల చెక్కుల పంపిణీ

పటాన్‌చెరు, నవంబర్ 18: (E6tv NEWS).

ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) తెలిపారు.

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన 56 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మొత్తం రూ.24.70 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రామచంద్రపురం, భారతీనగర్ డివిజన్లకు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు రూ.3,31,500 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రామచంద్రపురం సీనియర్ నాయకులు ఐలేష్ పాల్గొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ సహాయాన్ని అందించడంతో పాటు, ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *