Breaking News

దేవేందర్ రాజు జన్మదినం సందర్భంగా ఎండీఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు

మదర్ మేరీ అనాథ వృద్ధుల సేవాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

పటాన్‌చెరు, నవంబర్ 18:(E6tvNEWS).

ఎండీఆర్ ఫౌండేషన్ చైర్మన్, పటాన్‌చెరు మాజీ సర్పంచ్ మాదిరి దేవేందర్ రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇంద్రేశం పరిధిలోని మదర్ మేరీ అనాథ వృద్ధుల సేవాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించి, వారితో కొంత సమయం గడిపారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.పుట్టినరోజు వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, అనాథ వృద్ధులకు ఆప్యాయతను పంచుతూ, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ద్వారా సేవాభావాన్ని చాటుకోవడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎండీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు మధుతో పాటు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *