ముధోల్, సెప్టెంబర్ 20: (E6tv NEWS: ప్రతినిధి).
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ విద్యార్థులు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాఠశాలలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనానికి తరలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా వినాయక శోభాయాత్ర నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. శోభాయాత్రను తిలకించిన పట్టణ ప్రజలు విద్యార్థుల ప్రతిభను అభినందించారు.అనంతరం పట్టణ శివారులోని చెరువు వద్దకు చేరుకున్న విద్యార్థులు, పాఠశాల సిబ్బంది భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.

