హుజురాబాద్, సెప్టెంబర్ 19:(E6tv NEWS: ప్రతినిధి).
పట్టణంలో మురికి కాలువ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు శంకుస్థాపన చేశారు. సైదాపూర్ క్రాస్ రోడ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రూ.15 లక్షల వ్యయంతో చేపడుతున్న మురికి కాలువ నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు. మురికి కాలువ నిర్మాణంతో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించి, స్థానిక ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంజలి, కౌన్సిలర్లు కొండ ప్రశాంతి, మహమ్మద్ ఖలీద్ హుస్సేన్, బోరాగాల మొగిలి, బండ వెన్నెల నవీన్, సందమల్ల పుణ్య బాబు, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



