సంగారెడ్డి, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి).
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా పాట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి నూతన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, జిల్లాలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
నూతన బాధ్యతల్లో పాట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి విజయవంతంగా కొనసాగాలని పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

