Breaking News

జమ్మికుంటలో ఘనంగా శ్రీ శక్తి మహిళా గణపతి హోమం

జమ్మికుంట, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి).

హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు 6వ, 7వ వార్డుల పరిధిలో శ్రీ శక్తి మహిళా గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 6:30 గంటలకు ప్రత్యేక గణపతి హోమం, పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బ్రహ్మశ్రీ గొండవర్తి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత–నరేష్ దంపతులు, యాద ధనంజయ్–విజయలక్ష్మి, ఆడెపు కిరణ్–కావ్య, వరికొప్పుల సోమేశ్–నిర్మల, సబ్బని రాజు–సంధ్య, నరసింగమూర్తి–పద్మ, అయిత భాస్కర్–జ్యోతి, మన్నెమ్మ–సమ్మయ్య తదితరులు, అలాగే 6వ, 7వ వార్డులకు చెందిన మహిళలు, దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.గణపతి హోమం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళా గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో, రంగరంగ వైభవంగా జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *