Breaking News

రోస్టర్‌లో మాలలకు న్యాయం చేయాలి

అక్టోబర్ 4న హైదరాబాద్‌లో మాలల బహిరంగ సభ

మద్నూర్, సెప్టెంబర్ 20: (E6tv NEWS: ప్రతినిధి)

రోస్టర్ పాయింట్లలో మాలలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మాల సంఘం వ్యవస్థాపకుడు అయ్యాల సంతోష్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై అక్టోబర్ 4న హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ ఠాగూర్ ఆడిటోరియంలో మాలల బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

మద్నూర్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయ్యాల సంతోష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 16 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయగా, తమ సమాచారం ప్రకారం 12 నోటిఫికేషన్లలో మాలలకు ఒక్క పోస్టు కూడా కేటాయించలేదని ఆరోపించారు. రోస్టర్ పాయింట్లలో 12 లోపు మాలలకు కేటాయింపు ఉండే విధంగా మార్పులు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మాలలకు రోస్టర్ పాయింట్లలో న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి గ్రామ, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 4న హైదరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభకు మాల నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో మద్నూర్ మండల అధ్యక్షుడు ఆకాష్, నాయకులు జైపాల్, శ్రావణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *