Breaking News

మెడికల్ సీటు సాధించిన సాయి తేజ

మద్నూర్, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి)

కామారెడ్డి జిల్లా ఉమ్మడి మద్నూర్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థి సాయి తేజ ఎంబీబీఎస్ సీటు సాధించి ప్రతిభ చాటారు. మెడికల్ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి వరంగల్‌లోని మెడికల్ కళాశాలలో అడ్మిషన్ పొందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మద్నూర్ గ్రామానికి చెందిన సంతోష్–మేఘన దంపతుల కుమారుడు సాయి తేజ మెడికల్ ప్రవేశ పరీక్షలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 866వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. అలాగే ప్రకటించిన ఫలితాల్లో 67,146 ర్యాంకు సాధించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఉమ్మడి మద్నూర్ మండలానికి చెందిన ఐదుగురు విద్యార్థులు మెడికల్ ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సాయి తేజ ప్రతిభను అభినందిస్తూ పలువురు స్థానికులు ఆయనను ఘనంగా సన్మానించారు. నాందేవ్ మేస్త్రి, రచ్చ కుశాల్, శ్రీధర్ సుంకి, సంతోష్ అంబటివార్, పెంటేష్ రచ్చావా, నాగేష్ గొండ, నాగేష్ రక్షావార్, నాగేష్ పుత్తూరువార్, శంకరువార్, యాదవ్ రావు మేస్త్రి తదితరులు సాయి తేజను అభినందించి, భవిష్యత్తులో వైద్య రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

సాయి తేజ ఎంబీబీఎస్ సీటు సాధించడం మద్నూర్ ప్రాంతానికి, ఆయన కుటుంబ సభ్యులకు గర్వకారణమని స్థానికులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *