Breaking News

ఐకేపీ సిబ్బందికి సమీక్షా సమావేశం

eKYC పూర్తి చేయాలి.. బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిధి రికవరీపై దృష్టి పెట్టాలి

మద్నూర్, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి).

మద్నూర్ మండల సమాఖ్య కార్యాలయంలో బిచ్కుంద, మద్నూర్ మండలాల ఐకేపీ సిబ్బందికి సమీక్షా సమావేశం నిర్వహించినట్లు మద్నూర్ మండల ఏపీఎం జగదీశ్ కుమార్ తెలిపారు. సమావేశానికి అదనపు డీఆర్‌డీఓ విజయలక్ష్మి, డీపీఎం సాయిలు, స్త్రీనిధి రీజినల్ మేనేజర్ కిరణ్ హాజరై పలు అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు.

స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులందరికీ eKYC ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో ఇంకా స్వయం సహాయక సంఘాల్లో చేరని అర్హులైన మహిళలను గుర్తించి వివిధ సంఘాల్లో సభ్యులుగా చేర్పించాలని తెలిపారు. అలాగే స్త్రీనిధి రుణాలు, బ్యాంక్ లింకేజీ రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

చదువు మానేసిన వారికి ఓపెన్ సిస్టమ్‌లో విద్య

TOSS కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల్లో ఉన్న చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ సిస్టమ్ ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేలా ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులకు సంబంధించి పాఠశాల యూనిఫాం మొదటి జత పంపిణీ పూర్తయిందని, రెండో జత యూనిఫాంలను కూడా వారంలోగా పూర్తి స్థాయిలో అందించాలని తెలిపారు.

నిరక్షరాస్యులకు అక్షరాస్యత కల్పించాలి

ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల్లో ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి వారికి అక్షరజ్ఞానం కల్పించాలని సూచించారు. వారికి అవసరమైన శిక్షణ అందించి, పరీక్షలకు హాజరై ఉత్తీర్ణులయ్యేలా చూడాలని సిబ్బందికి సూచించారు.ఈ సమావేశంలో బిచ్కుంద ఏపీఎం రవీందర్, మద్నూర్ మండల ఏపీఎం జగదీశ్ కుమార్‌తో పాటు రెండు మండలాలకు చెందిన వీవోఏలు, సీసీలు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *