డబుల్ బెడ్రూమ్ కాలనీలో విద్యుత్ సమస్యకు పరిష్కారం
కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
పెద్ద కొడప్గల్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి).
మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో నెలకొన్న విద్యుత్ సమస్యను స్థానికులు జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎస్సీ సెల్ చైర్మన్, మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు సౌదగర్ అరవింద్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు.
ఈ సందర్భంగా విద్యుత్ శాఖ డీఈఓ అధికారితో ఫోన్లో మాట్లాడిన సౌదగర్ అరవింద్.. డబుల్ బెడ్రూమ్ కాలనీలో విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యపై అధికారులు సానుకూలంగా స్పందించి ఇచ్చిన హామీ మేరకు కాలనీలో నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు.ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కావడంతో విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించిందని కాలనీ వాసులు తెలిపారు. తమ సమస్యను విన్న వెంటనే స్పందించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేసిన సౌదగర్ అరవింద్‌కు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

