అక్బర్‌నగర్ గ్రామ పెద్దల కృషికి కృతజ్ఞతలు తెలిపిన అశోక్
ప్రజాపాలనలో తనకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని దరఖాస్తు
రుద్రూర్, సెప్టెంబర్ 21;(E6tv NEWS: ప్రతినిధి).
తనకు జరిగిన అన్యాయంపై అక్బర్‌నగర్ గ్రామ పెద్దలు స్పందించి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో న్యాయం జరిగిందని అశోక్ తెలిపారు. అయితే గ్రామ పెద్దలు, ఎమ్మెల్యే చొరవ లేకపోతే తన పరిస్థితి ఏమయ్యేదోనని ఆవేదన వ్యక్తం చేశారు.
రుద్రూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో అశోక్ తన సమస్యపై అధికారులకు దరఖాస్తు సమర్పించారు. తనకు జరిగిన అన్యాయంలో తాను ఎలాంటి తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తన సమస్యను అక్బర్‌నగర్ గ్రామానికి చెందిన పలువురు పెద్దలు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపారని అశోక్ తెలిపారు. వారి కృషి వల్లే తనకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని, అవసరమైతే ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని అశోక్ అన్నారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనను బాధ్యుడిని చేయడం అన్యాయమని ఆరోపించారు.తాను దళితుడిననే కారణంతోనే తనకు అన్యాయం జరిగిందని అశోక్ ఆరోపించారు. ఈ అంశంపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు తనకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని ప్రజాపాలనలో సమర్పించిన దరఖాస్తులో కోరారు.
తన సమస్యపై స్పందించి సహకరించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి, అక్బర్‌నగర్ గ్రామ పెద్దలకు అశోక్ కృతజ్ఞతలు తెలిపారు.

