Breaking News

గణేష్ శోభాయాత్రకు పటిష్ట భద్రత

నిర్మల్, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి).

నిర్మల్ పట్టణంలో రేపు నిర్వహించనున్న 9వ రోజు గణేష్ శోభాయాత్రకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ తెలిపారు. శోభాయాత్ర కొనసాగనున్న ప్రధాన మార్గాలతో పాటు గుల్జార్ మజీద్ ప్రాంతాన్ని ఎస్పీ పరిశీలించారు.

ఈ సందర్భంగా శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాలు, శోభాయాత్ర మార్గాల్లో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు.శోభాయాత్ర సమయంలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమన్వయంతో విధులు నిర్వహించాలని, సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు పోలీసులకు సహకరించి శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించాలని ఆమె కోరారు.

ఈ పరిశీలనలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సమ్మయ్య, ఎస్‌ఐలు శ్రీకాంత్, జాఫర్, సాయి సిద్ధార్థ్, ఆర్‌ఎస్‌ఐ ఎం. రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *