Breaking News

ముధోల్‌లో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర

ముధోల్, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి). ప్రతినిధి)ముధోల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలు, ఉత్సాహం మధ్య ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రతినిధి)ముధోల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలు, ఉత్సాహం మధ్య ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ శోభాయాత్ర జరుగుతున్న ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తూ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. శోభాయాత్ర మార్గంలో పోలీసు సిబ్బంది విధులు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.నిమజ్జన ఘాట్‌తో పాటు ప్రధాన కూడళ్లు, శోభాయాత్ర మార్గాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ పోలీసులు విధులు నిర్వహించారు.

ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించి నిబంధనలు పాటించడంతో శోభాయాత్ర సజావుగా కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయింది.నిమజ్జన బందోబస్తులో విధులు నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ముధోల్ ప్రజలకు, గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీస్ శాఖ కృతజ్ఞతలు తెలిపింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ఐపీఎస్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *