Breaking News

పెండ్‌పెల్లిలో రూ.2.36 కోట్లతో అభివృద్ధి పనులు

భైంసా, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి).

భైంసా మండలం పెండ్‌పెల్లి గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సోమవారం ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ, పూలు చల్లగా, డప్పు చప్పుళ్లతో నిర్వహించిన స్వాగత కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది.

ఈ సందర్భంగా రూ.30 లక్షలతో నిర్మించిన పాఠశాల ప్రహరీ గోడ, రూ.20 లక్షలతో నిర్మించిన మహిళా సమైక్య భవనం, రూ.57 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, రూ.14 లక్షలతో నిర్మించిన డ్రైనేజీ, రూ.7 లక్షలతో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనులతో పాటు రూ.కోటి నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతానని తెలిపారు. మహిళలు మరింత ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు.

గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పెండ్‌పెల్లి గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి, పనులు పూర్తి చేయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, మాజీ ఎంపీపీ రజాక్, భైంసా మండల బీజేపీ అధ్యక్షురాలు, దేగాం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *