ధర్మవరం, సెప్టెంబర్ 22: (E6tv NEWS: ప్రతినిధి).
ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ పుట్టినరోజు వేడుకలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గ్రామాలు, వార్డుల్లో పార్టీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు.
పుట్టినరోజు సందర్భంగా ధర్మవరం పట్టణ టీడీపీ నాయకులు దుర్గమ్మ దేవాలయంలో పరిటాల శ్రీరామ్ పేరిట ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద పేదలకు ఉచితంగా అల్పాహారం అందజేశారు.
అదేవిధంగా పాత మున్సిపల్ కార్యాలయం ఎదురుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఇదిలా ఉండగా రాప్తాడులో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరుకానున్న నేపథ్యంలో ధర్మవరం నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాప్తాడుకు తరలివెళ్లారు.




