Breaking News

విద్యార్థులతో మొక్కలు నాటించిన అధికారులు

ఎర్గట్ల, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి).

ఎరుగట్ల మండలం గుమ్మిరాల గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. “Ek Ped Maa Ke Naam” కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులతో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించారు.

పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, మొక్కల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, ఎంఈఓ, గ్రామపంచాయతీ కార్యదర్శి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *