Breaking News

గణేష్ రథయాత్ర మార్గంలో బీటీ రోడ్డు పనుల పర్యవేక్షణ

నిజామాబాద్, సెప్టెంబర్ 22:(E6tv NEWS: శివ ఠాకూర్).

నగరంలో శుక్రవారం నిర్వహించనున్న సార్వజనిక్ గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని గణేష్ రథయాత్ర సజావుగా సాగేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా గణేష్ రథయాత్ర వెళ్లే మార్గంలోని గుర్బాబాది రోడ్డు – శివాజీ చౌక్ నుంచి రైల్వే గేట్ వరకు చేపడుతున్న బీటీ రోడ్డు పనులను సంబంధిత అధికారులు, 35 వ డివిజన్ బిజెపి కార్పొరేటర్ ఎర్రం సుధీర్ పర్యవేక్షించారు.

గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు, గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజలు రథయాత్రలో పాల్గొనే అవకాశం ఉన్నందున రహదారి పరిస్థితిని ముందుగానే మెరుగుపరిచే చర్యలు చేపట్టారు. రథయాత్రకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారిపై ఉన్న గుంతలు, దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి బీటీ రోడ్డు పనులు చేపడుతున్నారు.

శివాజీ చౌక్ నుంచి రైల్వే గేట్ వరకు రథయాత్ర కొనసాగే మార్గంలో రహదారి పనుల నాణ్యత, పనుల పురోగతి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షించారు. నిమజ్జనోత్సవం రోజున భారీగా వాహనాలు, భక్తుల రాకపోకలు ఉండే అవకాశం ఉన్నందున రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.గణేష్ రథయాత్ర సమయంలో భక్తులకు, గణేష్ మండపాల నిర్వాహకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రహదారి సౌకర్యాలను సిద్ధం చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర అంశాలపై కూడా సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా గణేష్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా, సాఫీగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. భక్తులు, ప్రజలు అధికారులకు సహకరించి నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని కోరారు.గణేష్ రథయాత్ర మార్గంలో బీటీ రోడ్డు పనులు పూర్తి చేయడం ద్వారా నిమజ్జనోత్సవం సందర్భంగా రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు, స్థానిక కార్పొరేటర్ ఎర్రం సుధీర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *