పోచారం, సెప్టెంబర్ 22: (E6tv NEWS: ప్రతినిధి).
పోచారం గ్రామంలో సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ ఆధ్వర్యంలో రోల్‌బ్యాక్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గతంలో పెన్షన్ పొందుతూ, వివిధ కారణాలతో నిలిచిపోయిన ఆరుగురు అర్హులైన లబ్ధిదారులకు తిరిగి పెన్షన్లు మంజూరు కాగా, వాటిని లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెన్షన్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ జక్కు రజిత, పంచాయతీ కార్యదర్శి పద్మ, వార్డు సభ్యులు నీరడి రవికుమార్, గైని సుధాకర్, దండెం సాయిలు, వాయు కుమార్, వరలక్ష్మి, తాడేం మమత, పోస్టాఫీస్ అధికారి శంకర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

