Breaking News

బ్రెజిల్‌లో సీరియల్ కిల్లర్ అరెస్ట్:లేడీ గెటప్‌లో హత్య

బ్రెజిల్‌లో వరుస హత్యలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఓ డేంజరస్ సీరియల్ కిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరైబా రాష్ట్రానికి చెందిన జొర్లాన్ లోప్స్ డ సిల్వా (33) అనే వ్యక్తి గత మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా 16 మందిని దారుణంగా హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. అతడి సన్నటి శరీరాకృతి కారణంగా స్థానికులు అతడిని ‘మస్కిటో’ (దోమ) అని పిలిచేవారు.

మారుమూల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే జొర్లాన్, నేరం చేసిన వెంటనే దట్టమైన అడవుల్లోకి వెళ్లి దాక్కునేవాడు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకునేందుకు అతడు అమ్మాయి వేషధారణలో (లేడీ గెటప్‌) సంచరించేవాడని విచారణలో తేలింది. అతడి కదలికలపై అనుమానం రావడంతో గట్టి నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఓ క్రిమినల్ గ్యాంగ్‌తో సంబంధాలు కలిగి ఉన్న జొర్లాన్‌పై గతంలోనూ పలు నేరారోపణలు ఉండగా, ఈ 16 హత్యల కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *