Breaking News

రాజకీయ పరిస్థితులపై కార్యకర్తలకు అవగాహన

పుట్టపర్తి, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి).
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలోని కార్మిక కర్షక భవన్‌లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌లో భాగంగా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ వి. రాంభూపాల్ హాజరై ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, స్థానిక రాజకీయ పరిణామాలపై పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వి. రాంభూపాల్ మాట్లాడుతూ, స్థానిక రాజకీయ పరిస్థితులను కార్యకర్తలు లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. ఓట్ల సడలింపు, ప్రజలను రాజకీయంగా ప్రభావితం చేసే విధానాలు, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు తదితర అంశాలను వివరించారు.ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలులో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని అన్నారు.

కార్యకర్తలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను గుర్తించి, పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని వి. రాంభూపాల్ సూచించారు.ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో సీపీఎం జిల్లా కార్యదర్శి సి. రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు జీఎల్. నరసింహ, జెడ్‌పీ. శ్రీనివాసులు, ఏ. హరి, జంగాలపల్లి పెద్దన్న, ఫిరంగి ప్రవీణ్ కుమార్, పార్టీ సభ్యులు సాంబ, బ్యాల్ల అంజి, పెడబల్లి బాబా, అంకె ముత్యాలు, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *