Breaking News

వర్ణి మండల MRPS నూతన కమిటీ ఎన్నిక

వర్ణి, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి)
బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి సోంపూర్ పోచిరాం ఆధ్వర్యంలో, జిల్లా ఇన్‌చార్జి మాసాయిపేట యాదగిరి ఆదేశాల మేరకు వర్ణి మండల కేంద్రంలో MRPS మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా సంగోల్లా అశోక్, ఉపాధ్యక్షులుగా సమేనా కాశీరామ్, ప్రధాన కార్యదర్శిగా నెమ్లి ప్రభాకర్ను ఎంపిక చేశారు. కార్యదర్శులుగా చిట్టోళ్ల శ్రీనివాస్, ఫట్లా సాయిలు, కోశాధికారిగా ఈబత్వార్ మారుతీ, ప్రచార కార్యదర్శిగా సిందిగిడి రవిలను నియమించారు.సలహాదారులుగా కొరోల్లా సాయిలు, మెరుగు కాశీరామ్, శివుని సాయిలును ఎంపిక చేశారు.కార్యవర్గ సభ్యులుగా ఎభత్వర్ రాజు, గంగాధర్, దశరథుడు, సంగోల్లా గంగారం, అవనూరి రాజు, అవనూరి రామ్‌చందర్‌లను నియమించారు.

నూతన కమిటీ సభ్యులు MRPS ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, మండల స్థాయిలో సంఘటితంగా ముందుకు సాగాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో MRPS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *