Breaking News

సంగారెడ్డిలో వృద్ధురాలి గొంతు కోసి హత్య!

సంగారెడ్డి జిల్లాలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఒంటరిగా ఉంటున్న ఆమెను లక్ష్యంగా చేసుకున్న దుండగులు ఇంట్లోకి జొరబడి గొంతు కోసి హత్య చేశారు.

అసలు ఏం జరిగిందంటే? పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేట గ్రామానికి చెందిన కొత్తగాడి పోచమ్మ (75) అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై తీవ్ర దాడికి దిగారు. అనంతరం దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

నగల కోసమే దారుణానికి ఒడిగట్టారా? సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మృతురాలి మెడలోని బంగారు గుండ్లు, కమ్మలు, పట్టగొలుసులు మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నగల కోసమే ఈ దారుణ హత్యకు పాల్పడ్డారా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

తీవ్ర భయాందోళనలో గ్రామస్తులు: ఈ ఘటనతో పెద్దరెడ్డిపేట గ్రామంలో తీవ్ర భయాందోళనలు, శోకఛాయలు అలముకున్నాయి. క్లూస్ టీమ్ ద్వారా ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *