ఎన్నికల షెడ్యూల్‌కు సిద్ధంగా ఉన్నా: దానం నాగేందర్
హైదరాబాద్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి).
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు దానం నాగేందర్ తెలిపారు. తనను తిరిగి ప్రజాక్షేత్రంలో పోటీ చేయడానికి అవకాశం కల్పించే విధంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిందని పేర్కొన్నారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ తెలిపారు. అయితే ఎన్నికల సమయంలో తాను ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని అప్పుడే వెల్లడిస్తానని చెప్పారు.ఎన్నికల షెడ్యూల్ కోసం సిద్ధంగా ఉన్నానని, ప్రజాక్షేత్రంలో తిరిగి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు దానం నాగేందర్ స్పష్టం చేశారు.

