Breaking News

భైంసాలో శాంతియుతంగా ముగిసిన గణేష్ నిమజ్జనోత్సవం

జిల్లా ఎస్పీకి మున్సిపల్ కౌన్సిలర్ల కృతజ్ఞతలు

భైంసా, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి).

పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుతంగా, శోభాయమానంగా విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా భైంసా మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPSను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.నిమజ్జనోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ చేపట్టిన పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, నిరంతర పర్యవేక్షణతో పాటు ముందస్తు చర్యలు ఎంతగానో దోహదపడ్డాయని కౌన్సిలర్లు ఎస్పీకి తెలిపారు.

అలాగే ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS నేతృత్వంలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన నిర్మల్ జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ సిబ్బంది సమన్వయంతో, అంకితభావంతో విధులు నిర్వహించడం వల్లే నిమజ్జనోత్సవం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తుందని తెలిపారు. నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, అన్ని వర్గాల వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *