పరిగి, సెప్టెంబర్ 25: (E6tv NEWS: ప్రతినిధి).
శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నారెడ్డి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న చెన్నారెడ్డిని మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ పరామర్శించారు.ఈ సందర్భంగా చెన్నారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఉషశ్రీ చరణ్, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.

