గౌడ సంఘం అధ్యక్షుడిగా మీసాల గోవింద్ గౌడ్ విజయం వెనుక కృషికి అభినందనలు
రుద్రూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి)
రుద్రూర్ మండల గౌడ సంఘం ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన శ్రీధర్ గౌడ్‌ను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా మీసాల గోవింద్ గౌడ్ విజయం సాధించడంలో శ్రీధర్ గౌడ్ చేసిన కృషిని సంఘం సభ్యులు అభినందించారు.
రుద్రూర్ మండల గౌడ సంఘంలో మొత్తం 86 మంది ఓటర్లు ఉండగా, 83 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన మీసాల గోవింద్ గౌడ్‌కు 48 ఓట్లు లభించగా, గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన గుండూరు విట్టల్ గౌడ్‌కు 25 ఓట్లు, షేరెలా శంకర్ గౌడ్‌కు 10 ఓట్లు వచ్చాయి.మీసాల గోవింద్ గౌడ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంలో శ్రీధర్ గౌడ్ సభ్యులను సమన్వయం చేస్తూ ఎన్నికల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించారని గౌడ సంఘం సభ్యులు తెలిపారు. ఆయన సేవలను గుర్తించిన నూతన అధ్యక్షుడు మీసాల గోవింద్ గౌడ్‌తో పాటు సంఘం సభ్యులు శ్రీధర్ గౌడ్‌ను సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ “సంఘం ఐక్యతే మన బలం.. అందరి సహకారంతో గౌడ సంఘాన్ని మరింత అభివృద్ధి చేద్దాం” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

