బట్టాపూర్‌లో ఐదుగురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఎర్గట్ల, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి)
ప్రజా పాలనలో భాగంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఎర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో ఐదుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు.
బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ప్రభుత్వ సహాయంతో వైద్య ఖర్చుల భారం కొంత మేర తగ్గిందని లబ్ధిదారులు తెలిపారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు సయ్యద్ రఫీ, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోలి కైలాష్, చిలుక ప్రసాద్, భూషణవేణి నరేందర్, భూక్యా తిరుపతి, యుగేందర్, షేక్ నాగుల్ తదితరులు పాల్గొన్నారు.


