తనకల్లు, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి)
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండల కేంద్రంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.తనకల్లు మండల బాలికల గురుకుల కళాశాలలో చిత్రలేఖనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సీపీ తాండ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారిని శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె దేవానంద్ హాజరయ్యారు. ఓబీసీ మోర్చా నాయకులు ఈ. శ్రీనివాసులు, ఎద్దుల బాబు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల ప్రాధాన్యతను వారు వివరించారు.




