Breaking News

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: మంత్రి సవిత

పెనుకొండ, సెప్టెంబర్ 25: (E6tv NEWS: ప్రతినిధి)

చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సవిత విద్యార్థినులకు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురంలోని ఎం.జె.పి. బాలికల పాఠశాలను మంత్రి సవిత సాయంత్రం తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్యాబోధన, వసతులు, ఇతర సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. అనంతరం విద్యార్థినులు వివిధ క్రీడల్లో పాల్గొంటున్న తీరును స్వయంగా వీక్షించారు. విద్యార్థినులతో కొద్దిసేపు ముచ్చటించిన మంత్రి.. వారి ఆటతీరును అభినందించారు.చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని మంత్రి సవిత తెలిపారు. విద్యార్థినులు విద్యా, క్రీడా రంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *