Breaking News

పోలీసుల తీరుపై…నిమజ్జనాలు నిలిపేసి బంద్‌కు పిలుపు:ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర వేళ పోలీసుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బ్యాండ్ మేళాలపై ఆంక్షలు విధించడమే కాకుండా అర్ధరాత్రి వేళ కళాకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని ఆరోపిస్తూ హిందూ సంఘాలు, ఉత్సవ నిర్వాహకులు నిమజ్జనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. దీంతో పట్టణంలో ప్రధాన రహదారిపై దాదాపు 5 కిలోమీటర్ల మేర వందలాది గణపతి విగ్రహాలు, వాహనాలు నిలిచిపోయాయి.

శాంతియుతంగా సాగుతున్న శోభాయాత్రపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ నేడు ఆదిలాబాద్ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. అధికారులు వచ్చి బ్యాండ్ మేళాలతో యాత్రను పునఃప్రారంభించే వరకు విగ్రహాలను కదిలించేది లేదని హెచ్చరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బంద్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అదనపు బలగాలను మోహరించి, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *