Breaking News

మిర్జాపూర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి

నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 26:(E6tv NEWS: శివ ఠాకూర్).

మిర్జాపూర్ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని 3వ వార్డు మెంబర్ సబ్బిడి మొగులవ్వ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సబ్బిడి రమేష్ మాట్లాడుతూ.. దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. పేదలు, మహిళల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు.కార్యక్రమంలో జంగిలి హన్మండ్లు, చాకలి మహేందర్, రాములు, చింటూ, బాబయ్య, రాజయ్యతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *