Breaking News

చెన్నేకొత్తపల్లిలో సేవా సంకల్ప్ అభియాన్

అంగన్వాడీ కార్యకర్తలకు యూనిఫాం చీరలు, చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులు, పుస్తకాల పంపిణీ
25 మంది రైతులకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల అందజేత

చెన్నేకొత్తపల్లి: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో శనివారం “సేవా సంకల్ప్ అభియాన్ – ఆంగన్ కా ఉత్సవ్” కార్యక్రమాన్ని నిర్వహించారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చెన్నేకొత్తపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలకు యూనిఫాం చీరలను పంపిణీ చేయడంతో పాటు, అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల కోసం ప్రభుత్వం అందించిన ప్లేట్లు, గ్లాసులు, పుస్తకాలను పంపిణీ చేశారు.

అనంతరం చెన్నేకొత్తపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు నూతనంగా ఎంపికైన హెల్పర్లకు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ నియామక ఉత్తర్వులను అందజేశారు.

25 మంది రైతులకు ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ

అదేవిధంగా చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం గేట్‌లోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ పాల్గొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు, రైతులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన 25 మంది రైతులకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేశారు.

రైతులకు విద్యుత్ సరఫరా సంబంధిత సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో సీడీపీఓ కవితాదేవి, తహసీల్దార్ సురేష్‌కుమార్, ఎంపీడీఓ బాలకృష్ణుడు, డిప్యూటీ ఎంపీడీఓ అశోక్‌నాయక్, ఎస్సై సత్యనారాయణ, విద్యుత్ శాఖ అధికారులు, మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అలాగే చెన్నేకొత్తపల్లి కన్వీనర్ ముత్యాలరెడ్డి, మాజీ ఎంపీపీ అమరేంద్ర, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబులేసు, టీడీపీ సీనియర్ నాయకులు రంగయ్య, రామ్మూర్తినాయుడు, సీనియర్ నాయకులు చెన్నకేశవగౌడ్, అంగన్వాడీ సూపర్‌వైజర్లు, కార్యకర్తలు, ఆయాలు, కార్యాలయ సిబ్బంది, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *